రానా 'విరాటపర్వం'లో కీలక పాత్రలో నివేదా పేతురాజ్
- December 11, 2020
హైదరాబాద్:రానా, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం 'విరాటపర్వం'. 'నీదీ నాదీ ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని డి. సురేష్‌బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఇప్పటికే పలువురు పేరుపొందిన తారలు నటిస్తోన్న ఈ చిత్రంలో తాజాగా నివేదా పేతురాజ్ జాయిన్ అయ్యారు. ఆమె ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో ఆమె పాల్గొంటున్నారు.
ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని పాత్రల్లో రానా, సాయిపల్లవి నటిస్తున్నారు. మిగతా ముఖ్య పాత్రల్లో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ కనిపించనున్నారు.
తారాగణం:
రానా దగ్గుబాటి, సాయిపల్లవి, ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్, బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీప్రసాద్, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: వేణు ఊడుగుల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సమర్పణ: సురేష్ బాబు
బ్యానర్స్: సురేష్ ప్రొడక్షన్స్, ఎస్.ఎల్.వి. సినిమాస్
సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
స్టంట్స్: స్టీఫెన్ రిచర్డ్, పీటర్ హెయిన్
ప్రొడక్షన్ డిజైన్: శ్రీనాగేంద్ర
కొరియోగ్రఫీ: రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ చాగంటి
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్: ధని ఏలే
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు