ఒంగోలులో 'రిసౌండ్' షూటింగ్
- December 11, 2020
హైదరాబాద్:సాయిరామ్ శంకర్ హీరోగా 'రిసౌండ్' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా ఎస్.ఎస్. మురళీకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాశీ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సురేష్ రెడ్డి, అయ్యప్పరాజు, రాజారెడ్డి నిర్మిస్తున్నారు.
ఇదివరకు లాక్‌డౌన్ అనంతరం హైదరాబాద్‌లో షూటింగ్ పునరుద్ధరించి, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒంగోలులో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని ప్రధాన ఘట్టాలతో పాటు రెండు పాటలను చిత్రీకరిస్తున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.
'రిసౌండ్' టైటిల్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇందులో ఓవైపు ఎంటర్‌టైన్ చేస్తూ, మరోవైపు యాక్షన్‌తో అలరించే పాత్రను సాయిరామ్ శంకర్ చేస్తున్నారు.
సాయిప్రకాష్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రానికి స్వీకార్ అగస్తి సంగీతం సమకూరుస్తున్నారు.
తారాగణం:
సాయిరామ్ శంకర్, రాశీ సింగ్, పోసాని కృష్ణమురళి, అరవింద్ కృష్ణ, అజయ్ ఘోష్, కాశీ విశ్వనాథ్, 'అదుర్స్' రఘు, పింకీ
సాంకేతిక బృందం:
డైరెక్టర్: ఎస్.ఎస్. మురళీకృష్ణ
ప్రొడ్యూసర్స్: సురేష్ రెడ్డి, అయ్యప్పరాజు, రాజారెడ్డి
మ్యూజిక్: స్వీకార్ అవస్తి
సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్
ఎడిటింగ్: ఉపేంద్ర
ఫైట్స్: నబా స్టంట్స్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







