జీవ,రసాయన తదితర పదార్థాల ఎమర్జెన్సీ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన GMR

- December 11, 2020 , by Maagulf
జీవ,రసాయన తదితర పదార్థాల ఎమర్జెన్సీ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన GMR

హైదరాబాద్:GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (GHIAL) జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA), రసాయన, జీవ, రేడియోలాజికల్ మరియు అణు పదార్థాల (CBRN) అత్యవసర నిర్వహణపై డిసెంబర్ 8–10, 2020 మధ్య మూడు రోజుల ప్రాథమిక శిక్షణను నిర్వహించింది. విమానాశ్రయాలలో రసాయన, జీవ, రేడియోలాజికల్ మరియు అణు పదార్థాల వల్ల తలెత్తే ప్రమాదాలను నివారించడానికి, అత్యవసర పరిస్థితులకు స్పందించడానికి, విమానాశ్రయ అత్యవసర నిర్వాహకుల సంసిద్ధతను పెంచడానికి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రాథమిక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ శిక్షణా కార్యక్రమాన్ని  సందీప్ పౌండ్రిక్, NDMA అదనపు కార్యదర్శి మరియు డైరెక్టర్, జనరల్ కోలేషన్ పర్ డిసాస్టర్ రెసిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (CDRI) ప్రారంభించారు. GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన రెండవ శిక్షణ కార్యక్రమం ఇది.

ఈ కార్యక్రమంలో ప్రసంగాలు, క్షేత్రస్థాయి శిక్షణతో పాటు వ్యక్తిగత రక్షణ పరికరాల (పిపిఇ) వాడకం, ప్రమాదకర వస్తువులను గుర్తించడం. వాటిని నిర్వీర్యం చేయడం గురించి వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా CBRN అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి విమానాశ్రయ అత్యవసర నిర్వాహకులను సన్నద్ధం చేయడమే కాకుండా, వారు ప్రథమ చికిత్స, ప్రాథమిక సైకో-సోషల్ సపోర్ట్ అందించడానికి వీలు కల్పిస్తుంది మూడు రోజుల శిక్షణలో CBRN అత్యవసర పరిస్థితులపై 125 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రదీప్ పణికర్, సీఈఓ, GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మాట్లాడుతూ “హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత అతి ముఖ్యమైనది. భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించడమే కాకుండా, అత్యవసర పరిస్థితులను, సంక్షోభాలను ఎదుర్కోనేలా మా బృందాలు అత్యుత్తమ శిక్షణ పొందాయి. NDMA ఇచ్చిన ఈ CBRN ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ శిక్షణ అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే మా సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. ప్రయాణీకులు, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కాపాడటానికి మా నిబద్ధతను మరింత బలోపేతం చేసేలా ఈ శిక్షణను నిర్వహించినందుకు NDMA కి మా కృతజ్ఞతలు”. అన్నారు.

‘‘ప్రస్తుత కోవిడ్ప రిస్థితిలో ప్రతి విమానాశ్రయం ఏదైనా CBRN అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే ఈ మహమ్మారి పరిస్థితుల్లో కూడా అత్యవసర పరిస్థితులు తలెత్తవచ్చు. గత ఆరు నెలల్లో అనేక రసాయన ప్రమాదాలు జరిగి, చాలా మంది గాయపడ్డారు,” అని శ్రీ సందీప్ పౌండ్రిక్  CBRN అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి ప్రత్యేక నైపుణ్యాలు, ప్రయత్నాలు అవసరమనే విషయాన్ని నొక్కి చొప్పారు. ఈ శిక్షణను సమన్వయపరిచిన జిఎంఆర్ మేనేజ్‌మెంట్, ARFF బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకులు, విమానాశ్రయాల భద్రతను కాపాడుతూ తన సేవలను నిరంతరం మెరుగుపరచడానికి కట్టుబడి ఉంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యంత అధునాతన సాంకేతికత, అత్యవసర పరిస్థితుల నిర్వహణా మార్గాలు ఉన్నాయి. విపత్కర పరిస్థితుల సంసిద్ధతలో అనేక కార్యక్రమాలను మొదట ఈ విమానాశ్రయమే ప్రారంభించింది. 

ఏదైనా విపత్కర పరిస్థితుల పరిష్కరానికి హైదరాబాద్ విమానాశ్రయంలో ఎయిర్‌క్రాఫ్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్ (ARFF) బృందం ఉంది. అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) ప్రమాణాలు, సివిల్ ఏవియేషన్ అవసరాలు (CAR)కు అనుగుణంగా వినియోగదారులకు ప్రపంచస్థాయి విమానాశ్రయ రెస్క్యూ మరియు ఫైర్ ఫైటింగ్ సేవలను అందించే ఉద్దేశంతో ARFF బృందం పని చేస్తుంది.

విమానాశ్రయ ఆపరేటర్‌గా, విమానాశ్రయ టెర్మినల్‌లో ఏదైనా ప్రమాదకర పదార్థాలను సరిగా నిర్వహించడంలో GHIAL చురుకైన పాత్ర పోషించాలి. GHIAL యొక్క ARFF బృందంలో రేడియోధార్మిక, మండే, పేలుడు, ఆక్సిడైజింగ్, బయో-హజార్డస్, విష, వ్యాధికారక లేదా అలెర్జీ పదార్థాలు లాంటి ప్రమాదకరమైన వస్తువులను హ్యాండిల్ చేయడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com