యూఏఈ:ప్రవాసీయులకు న్యాయ సహాయం, సలహాల కోసం లీగల్ సెంటర్ ఏర్పాటు
- December 12, 2020
యూఏఈ:చట్టాలపై అవగాహనకు, న్యాయ సలహాలతో పాటు లాయర్ ఖర్చులు భరించలేని వారికి న్యాయ సహాయం చేసే లక్ష్యంతో కొత్తగా లీగల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది యూఏఈ ప్రభుత్వం. అబుధాబిలో ప్రారంభమైన ఈ కేంద్రం కింగ్డమ్ లోనే మొదటిది కావటం విశేషం. బతుకుదెరువు కోసం, ఉద్యోగాల కోసం పలు దేశాల నుంచి యూఏఈ వెళ్లే వారిలో చాలా మందికి అక్కడి చట్టాలు, కార్మిక హక్కుల గురించి అవగాహన తక్కువ. కార్మిక రంగంలో పని చేస్తున్న కార్మికుల్లో నిరక్షరాస్యులు కూడా ఎక్కువే. కనీసం వాళ్లు చేసిన పనికి న్యాయం రావాల్సిన డబ్బులు, ఫైనల్ సెటిల్మెంట్ల గురించి కూడా సరిగ్గా తెలియని వారు ఉన్నారు. అలాంటి వారికి యూఏఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లీగల్ సెంటర్ సహాయంగా నిలబడుతుంది. ఈ లీగల్ సెంటర్ ద్వారా యూఏఈ చట్టాలపై అవగాహన కల్పించటం, ఏయే పనులు చట్ట వ్యతిరేకమో..ఏవి చేయాలో...ఏవి చేయొద్దో ప్రవాసీయులకు అవగాహన కల్పించనున్నారు. అలాగే దేశంగానీ దేశంలో న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు కనీసం కోర్టు ఖర్చులు, లాయర్ ఫీజులు చెల్లించుకోలేని వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటి వారికి ఉచితంగా న్యాయ సహాయం అందించటం కూడా లీగల్ సెంటర్ ప్రధాన ఉద్దేశం. చట్టం, న్యాయపరమైన ఏ చిన్న అంశాలపై అయినా ప్రజలు తమను సంప్రదించవచ్చని లీగల్ సెంటర్ అధికారులు వెల్లడించారు. యూఏఈ చట్టాలపై అవగాహన లేకపోవటంతో సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు రాసి, షేర్ చేసి జైలు పాలైన వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకూడదు, ఎలాంటివి షేర్ చేయకూడదో లీగల్ సెంటర్ ను సంప్రదించి అనుమానాలను నివృతి చేసుకోవచ్చు. ఇక కారు ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపరిహారాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చో తగిన సలహాలు పొందవచ్చు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు అనుసరిస్తున్న చట్టాలపై తగిన సలహాలు తీసుకోవచ్చు. లాక్ డౌన్ నేపథ్యంలో పెరిగిపోయిన స్మార్ట్ ఫోన్ వినియోగంతో ఆన్ లైన్ గేమింగ్, సైబర్ క్రైం పెరుగుతుండటంతో యువత పెడదారిన పట్టకుండా కూడా లీగల్ సెంటర్ చొరవ తీసుకోనుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు