గల్ఫ్ సంక్షోభ నివారణకు కువైట్ కృషిని స్వాగతించిన భారత్
- December 12, 2020
కువైట్ సిటీ:గల్ఫ్ దేశాల మధ్య సంక్షోభం, వైరుధ్యాలను నివారించే దిశగా కువైట్ ప్రభుత్వం చేస్తున్న కృషిని భారత ప్రభుత్వం స్వాగతించింది. జీసీసీ సభ్య దేశాల మధ్య పొరపొచ్చాలను తొలగించేందుకు ఫలవంతమైన చర్చలు జరిగాయని కువైట్ తరపున వెలువడిన ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇతర దేశాల నుంచి కూడా సానుకూల స్పందన కనిపించటం స్వాగతించదగిన విషయమన్నారు. నాగరికత పరంగా, ఆర్ధికంగా, రాజకీయంగా గల్ఫ్ దేశాలతో భారత్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని...జీసీసీ దేశాల అంతర్గత పొరపొచ్చాలు త్వరలోనే సమసిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







