బీటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..

- December 12, 2020 , by Maagulf
బీటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..

న్యూ ఢిల్లీ:భారత కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (NBCC) ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 100 ఖాళీలను భర్తీ చేస్తోంది. బీటెక్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజనీర్ పోస్టుల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఢిల్లీ, ఒడిషా, జార్ఖండ్‌లలో ఈ ఖాళీలు ఉన్నాయి. రెండేళ్ల కాంట్రాక్ట్ వ్యవధితో ఈ పోస్టులను రిక్రూట్ చేస్తుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. డిసెంబర్ 15 దరఖాస్తుకు చివరి తేదీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com