అబుధాబి రేస్‌కు లూయిస్ హామిల్టన్ రెడీ
- December 12, 2020
అబుధాబి:కరోనా బారిన పడిన ఫార్ములా వన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తాజా కొవిడ్ పరీక్షలో నెగెటివ్‌గా తేలడంతో వచ్చే వారం జరిగే అబుధాబి రేస్‌లో పాల్గొననున్నాడు.కరోనా కారణంగా హామిల్టన్ గతవారం జరిగిన బహ్రెయిన్‌లో జరిగిన సాఖిర్ గ్రాండ్ ప్రి రేస్‌లో పాల్గొనలేకపోయాడు.
అతని స్థానంలో బ్రిటన్‌కే చెందిన జార్జి రస్సెల్ మెర్సిడెస్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇపుడు రస్సెల్ తిరిగి తన పాత సంస్థ విలియమ్స్ తరఫున బరిలోకి దిగుతాడు.
బహ్రెయిన్‌లో పది రోజులపాటు క్వారంటైన్ పూర్తిచేసుకున్న హామిల్టన్ గురువారం అబుధాబిలోని యాస్ మరినా సర్క్యూట్‌కు చేరుకున్నాడు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష