ఫైజర్ వాక్సిన్ వినియోగానికి అమెరికా ఆమోదం
- December 12, 2020
అమెరికా: కరోనా మహమ్మారితో అమెరికా అతలాకుతలమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీకి చెందిన బయో ఎన్టెక్ సంయుక్తంగా రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఈమేరకు వ్యాక్సిన్ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అనుమతించింది. దేశంలో కరోనా కట్టడికి ఇది మార్గం సుగమం చేస్తుందని వెల్లడించింది. ఫైజర్ వినియోగంపై ఉన్న సందేహాలను తొలగించడానికి, అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఫైజర్ అత్యవసర వినియోగానికి ఎఫ్డీఏ అనుమతించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..