బర్త్ డే కి న్యూ స్టైలిష్ లుక్ లో అదరకొడుతున్న విక్టరీ వెంకటేష్
- December 12, 2020
హైదరాబాద్:ఎన్నో మరపురాని ఘన విజయాలను సాధించి 'విక్టరీ' నే తన ఇంటి పేరుగా చేసుకున్న వెంకటేష్ దగ్గుబాటి జన్మదినం డిసెంబర్ 13. ప్రస్తుతం 'నారప్ప' గా పవర్ ఫుల్, ఇంటెన్స్ రోల్ లో కనిపిస్తున్న వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ ఈ రోజు (డిసెంబర్ 12) రాత్రి 8:00 గం లకు విడుదల చేయనున్నారు. 'నారప్ప' తర్వాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి 'F3' చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ పుట్టినరోజుకు వెంకటేష్ న్యూ ఫోటోషూట్ స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. ఈ స్టిల్స్ లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో, గెడ్డంతో స్టైలిష్ గా వెంకీ అదరకొడుతున్నారు. ట్రేమెండస్ రెస్పాన్స్ వచ్చిన ఈ స్టిల్స్ కాజువల్ గా తీసినవే అని చెప్తున్నప్పటికీ, ఫ్యూచర్ లో రాబోయే ఫిల్మ్ లో ఖచ్చితంగా ఈ స్టైలిష్ లుక్ తో విక్టరీ వెంకటేష్ ప్రేక్షకులను అభిమానులను అలరించనున్నారని తెలుస్తోంది. ఇంతకీ అది ఏ చిత్రంలో ఉంటుందో వెయిట్ అండ్ సీ...
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









