రాంగోపాల్ వర్మ విడుదల చేసిన 'డి.ఎస్.జె' టీజర్ !
- December 12, 2020
డైరెక్టర్ నట్టికుమార్ మాట్లాడుతూ...
నేను గతంలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఇప్పుడు నా దర్సకత్వంలో నా కూతురు నట్టి కరుణ హీరోయిన్ గా నటించడం నాకు సంతోషం. నేను నా కూతురికి పాటలు నేర్పినట్లు ఉంది. అలాగే నా కుమారుడు నట్టి క్రాంతి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మేము అడిగినవన్నీ మాకు సమకూరుస్తున్నారు. ఈ సినిమాతో నా కొడుకు, కూతురు నిర్మాతగా హీరోయిన్ గా వ్యవహరించడం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి అబ్బాయి రోషన్ సాలూరి హీరో అద్భుతంగా నటించాడు. కరోనా సమయంలో కూడా మేము అడగ్గానే మా సినిమా చేసినందుకు రోషన్ సాలూరికి ధన్యవాదాలు తెలిపారు.
హీరోయిన్ నట్టి కరుణ మాట్లాడుతూ...
మా సినిమా డి.ఎస్.జె టీజర్ విడుదల చేసిన రాంగోపాల్ వర్మ గారికి ధన్యవాదాలు. కరోన సమయంలో అందరూ బాగా సహకరించడం వల్ల షూటింగ్ ఈజీగా పూర్తి అయ్యిందని తెలిపారు.
హీరో రోషన్ సాలూరి మాట్లాడుతూ...
నట్టికుమార్ గారు సినిమాను బాగా తెరకెక్కించారు. అందరికి ఈ సినిమా నచ్చుతుంది. నట్టి కరుణ బాగా నటించింది, నటిగా తనకు మంచి భవిషత్తు ఉంటుంది. టీజర్ బాగుందని అందరూ అంటున్నారు. నట్టి క్రాంతి సినిమాను మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తీశారని తెలిపారు.
నటీనటులు:
హీరో: రాజు సాలూరి
హీరోయిన్: నట్టి కరుణ, సుపూర్ణ మాలకర్
హరీష్ చంద్ర, బాబు మోహన్, హేమంత్, స్నిగ్ధ, తదితరులు.
సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: నట్టి కుమార్
నిర్మాత: నట్టి క్రాంతి
కెమెరామెన్: కోటేశ్వర రావు
సంగీతం: ఎస్.ఏ.కుద్దుస్
ఎడిటింగ్: గౌతంరాజు
ఆర్ట్: కెవి.రమణ
ఫైట్స్: కె.అంజిబాబు
పిఆర్ఒ: మధు.విఆర్
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







