దసరా కానుకగా అక్టోబర్15, 2021న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ‘మైదాన్’
- December 12, 2020
హైదరాబాద్:భారత ఫుట్ బాల్ ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`. బధాయి హో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఫుట్‌బాల్‌కి స్వర్ణయుగమైన 1952-62 మధ్య కాలానికి సంబంధించిన కథతో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన మైదాన్ పోస్టర్స్ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా దసరా కానుకగా అక్టోబర్ 15, 2021న `మైదాన్` చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ - `` ఇప్పటి వరకూ తెరపై చూడని ఒక స్పూర్తివంతమైన కథతో ప్రతి భారతీయుడు గర్వపడేలా మైదాన్ చిత్రం ఉంటుంది. దసరా కానుకగా అక్టోబర్ 15, 2021న మైదాన్ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం`` అన్నారు.
నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, బధాయి హో ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న మైదాన్ ని ఫ్రెష్‌లైమ్ ఫిల్మ్ సహకారంతో జీ స్టూడియోస్ బేనర్‌పై బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







