ఈనెల 17న మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
- December 13, 2020
బెంగుళూరు:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 17న పీఎస్‌ఎల్‌వీ సీ-50 ప్రయోగం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది. ఈనెల 17 మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ – సీ50 రాకెట్ ద్వారా 1,410 కేజీల బరువు కలిగిన సీఎంఎస్-01 అనే ఉపగ్రహన్ని నింగిలోకి పంపనుంది. ఈమేరకు వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం చేసిన దృశ్యాలను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది.
ఈ ఉపగ్రహం ప్రయోగించిన అనంతరం మొదట 18వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూబదిలీ కక్ష నుంచి 36వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూస్థిర కక్షలోకి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెడతారు. సీఎంఎస్ భారతదేశపు 42వ కమ్యూనికేషన్ ఉప్రగహం. ఈ సీఎంఎస్-01 ఫ్రీక్వెన్సీ స్పెక్ర్టంలో విస్తరించిన సీ బ్యాండ్ సేవలను అందించేందుకు నిర్దేశించారు. ఈ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రం వల్ల భారత్‌తో పాటు అండమాన్ నికోబార్ దీవులు, లక్ష్యదీప్‌లకు మెరుగైనా బ్రాడ్ బ్యాండ్ సేవలు అంతరాయం లేకుండా అందించవచ్చు. ఈ ఉపగ్రహం ఏడు సంవత్సరాల పాటు కక్షలో తిరుగుతూ సేవలు అందిస్తుంది. పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ సిరీస్‌లో ఇది 22వ ప్రయోగం అని ఇస్రో తెలిపింది. అంతేకాకుండా షార్ నుంచి ఇది 77వ మిషన్ అని కూడా వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







