శిశివు జనం..ఆనందంలో మునిగిన తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు

- December 13, 2020 , by Maagulf
శిశివు జనం..ఆనందంలో మునిగిన తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు

దుబాయ్:శిశివు జన్మించిన సంతోషంలో తండ్రి చేసిన పని తనను కటకటాలపాలు చేసింది. విషయమేంటంటే..దుబాయ్ లో నివసిస్తున్న వ్యక్తి తనకు శిశువు జన్మించడంతో ఆనందంలో తన నివాస ప్రాంతంలో టపాసులు కాల్చాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే, ఈ సంబరాలు కాస్తంత ఆస్తి నష్టం కూడా కలిగించడటంతో హుటాహుటిన దుబాయ్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు పంపినట్లు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది పోలీసు యంత్రాంగం.

టపాసులు కాల్చడం ఆస్తి నష్టాన్ని కలిగించటమే కాకుండా అవాంఛిత సంఘటనలు జరిగే ప్రమాదం ఎక్కువ ఉన్నందున వాటి వాడకాన్ని నిషేదించాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు దుబాయ్ పోలీసులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com