ఎఫ్3 పోస్టర్ విడుదల
- December 13, 2020
హైదరాబాద్:వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా తెరకెక్కిన సినిమా ఎఫ్2. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను అనిల్ రావిపుడి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా హిట్ అవ్వడంతో అనిల్‌కు మంచి పేరు వచ్చింది. దాని తరవుత మహేష్‌తో సరిలేరు నీకెవ్వరు తీసి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే ఇటీవల వచ్చిన కథనాల ప్రకారం లాక్డౌన్ సమయంలో అనిల్ ఎఫ్2కు సీక్వెల్‌ను సిద్దం చేశాడని, దానిని ఎఫ్3గా తెరకెక్కించనున్నారిన వార్తలు వచ్చాయి. తరువాత నిర్మాత దిల్ రాజు వాటిని నిజం చేస్తూ మాట్లాడారు. ఈ సినిమా కొత్త కథాంశంతో తెరకెక్కనుందని కూడా తెలిపారు. అయితే నేడు విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఎఫ్3 పోస్టర్‌ను విడుదల చేసి సినిమాకు అధికారిక ప్రకటనను ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది 2021లో ప్రారంభం కానుంది. ఇందులో వెంకీమామ, వరుణ్ తేజ్‌లు డబ్బుల కట్టలు పోగేసుకొని పరుగుతు తీస్తూ కనిపిస్తున్నారు. అయితే ఇందులో కూడా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఉంటాయని కానీ అవి డబ్బుతో వస్తాయని పోస్టర్ తెలుపుతుంది. మరి ఈ సినిమాలో ఏరేంజ్‌లో ఫన్, ఫ్రస్ట్రేషన్ చూపిస్తారనేది వేచి చూడాలి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







