బుర్జ్ ఖలీఫాపై మీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఎలా అంటే?
- December 13, 2020
దుబాయ్:న్యూ ఇయర్ వస్తోంది.మీ సన్నిహితుల కోసం ఏమని అభిలాషిస్తున్నారు? మీ ఆకాంక్షలను మాకు పంపించండి వాటిని పెద్దఎత్తున ప్రదర్శిస్తామని పిలుపినిచ్చింది ప్రపంచంలోని అతి ఎత్తయిన సౌధం బుర్జ్ ఖలీఫా.
బుర్జ్ ఖలీపా 829 మీటర్ల ఎత్తులో ఆకాశాన్ని తాకుతుంటుంది. రాత్రిళ్లు ఆ సౌధాన్నంతా ఎల్ఈడీ దీపకాంతులతో మిరిమిట్లుగొలిపేలా చేస్తారు. రంగు రంగుల దీపకాంతులలో అక్షరాలను ఎల్‌ఈడీ ప్యానెల్‌పై డిస్‌ప్లే చేస్తూ బుర్జ్ ఖలీఫా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. సందర్భానుసారంగా అనేక సందేశాలను ప్రదర్శిస్తుంటారు. గత ఏడాది డిసెంబర్ 31న అర్ధరాత్రి ప్రపంచవ్యాప్తంగా వీక్షకులు పంపిన సందేశాలను డిస్‌ప్లే చేశారు. ఈ ఏడాది కూడా సందేశాలను పంపమని కోరుతున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఎవరైనా సరే తమ అభినందనలు బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించుకోవచ్చు. 35 అక్షరాలకు మించకుండా బుర్జ్ ఖలీఫా ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రాముల కామెంట్ సెక్షన్లలో #BurjWishes2021 హ్యాష్‌ట్యాగ్‌పై పోస్ట్ చేయాలి. దుబాయ్‌లో న్యూ ఇయర్ సందడికి వెళ్లే వాళ్లు వీటిని ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇంట్లోనే లైవ్‌స్ట్రీమ్‌లో చూసేలా ఏర్పాటు చేశారు నిర్వాహకులు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







