'ఆర్టీఎ' నంబర్ ప్లేట్ల ఆక్షన్ ఫిబ్రవరి 23న
- February 19, 2016
38వ ఆన్లైన్ ఆక్షన్ ఫిబ్రవరి 23న ప్రారంభమవుతుంది. రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ లైసెన్సింగ్ ఏజెన్సీ, నాలుగు మరియు ఐదు సంఖ్యలు గల నెంబర్ ప్లేట్లను జె, కె, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ మరియు ఆర్ కోడ్స్ ద్వారా విడుదల చేస్తుంది. ఆర్టీఏ డైరెక్టర్ ఆఫ్ వెహికిల్స లైసెన్సింగ్ అథారిటీ సుల్తాన్ అల్ మర్జోకి మాట్లాడుతూ, నంబర్ ప్లేట్లపై ప్రత్యేక ఆసక్తి చూపేవారి కోసం ఈ ఆన్లైన్ ఆక్షన్ విధానాన్ని ప్రవేశపెట్టామని అన్నారు. ఫ్యాన్సీ నెంబర్లను కోరుకునేవారు ఆక్షన్‌లో పాల్గొనాల్సింఇగా పిలుపునిచ్చారు. ఆర్టఇఎ పోర్టల్ లేదా దుబాయ్‌లోని కస్టమర్ సర్వీస్ సెంటర్ ద్వారా ఆక్షన్‌లో పాల్గొనే అవకాశం ఉంది. బిడ్డింగ్ స్టార్ట్ చేసే ముందు 5,000 దిర్హామ్‌లు డిపాజిట్ చెయ్యవలసి ఉంటుంది. గతంలో నిర్వహించిన ఆక్షన్ విజయవంతమైందనీ, ఈసారి ఆక్షన్ ఇంకా విజయవంతమవుతుందని అల్ మర్జోకి చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







