దుబాయ్ పర్యాటకులకు ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్...
- December 13, 2020
దుబాయ్:లాక్ డౌన్ ఎత్తివేసినా వ్యాపార రంగాన్ని మాత్రం ఇంకా కోవిడ్ సంక్షోభాన్ని వెంటాడుతూనే ఉంది. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా దుబాయ్ లో పలు పర్యాటక కేంద్రాలకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే..అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షల పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేకపోవటంతో పర్యాటక రంగం మాత్రం ఇంకా గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోంది. అయితే..తమ పరిధిలోని పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేందుకు దుబాయ్ యంత్రాంగం విదేశీ పర్యాటకుల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ లో ప్రయాణించిన వారికి 5 స్టార్ హోటల్ లో ఫ్రీగా బస ఏర్పాటు చేస్తోంది. ఎకనామి క్లాస్ లో ప్రయాణించిన వారికి మారియట్ మార్క్యూస్ లో ఓ రాత్రి ఉచితంగా బస చేయవచ్చు. ఇక బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు రెండు రాత్రుళ్లు ఉచితంగా బస సౌకర్యాన్ని అందించనున్నారు. ఈ ఆఫర్ ఈ నెల 6 నుంచి వచ్చే ఫిబ్రవరి 28 వరకు అమలులో ఉంటుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష