వదిలివేయబడ్డ వాహనాల ఆక్షన్
- December 14, 2020
మస్కట్:వదిలివేయబడ్డ వాహనాల్ని జనరల్ పబ్లిక్, అమెరాత్లోని బలాదియా యార్డ్లో పరీక్షించుకోవచ్చని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. పలు రకాల ఉల్లంఘనల నేపథ్యంలో వాహనాల్ని స్వాధీనం చేసుకోవడం లేదా సివిక్ అథారిటీ ద్వారా బలవంతంగా తరలించిన వాహనాల్ని ఇక్కడ డంప్ చేయడం జరిగింది. ఆయా వాహనాల విషయమై యజమానులు ముందుకు రాని పక్షంలో, వాటిని ఆక్షన్ వేసే అవకాశం వుంటుంది. డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య వాహనాల్ని పరిశీలించి, తమ ఆలోచనల మేరకు ఏదన్నా వాహనాన్ని కొంత మొత్తం చెల్లించి సొంతం చేసుకోవచ్చు. ఆక్షన్ వేయబడే ప్రాంతంలోకి ప్రవేశించేందుకు 4 ఒమన్ రియాల్స్ చెల్లించాల్సి వుంటుంది. ఇది తిరిగి చెల్లించబడదు. ఆక్షన్లో పాల్గొనేందుకు తిరిగి చెల్లించే వీలున్న 500 ఒమన్ రియాల్స్ చెల్లించాల్సి వుంటుంది. సక్సెస్ఫుల్ బిడ్డింగ్ తర్వాత మొత్తం సొమ్ముతోపాటు, 3 శాతం ప్రమోషనల్ ఛార్జీలు చెల్లించాలి. ఆక్షన్ పూర్తయ్యాక 10 రోజుల్లోగా ఓనర్షిప్ బదలాయించబడుతుంది. ఆలస్యం చేస్తే రోజుకి 50 ఒమన్ రియాల్స్ ఛార్జీ వుంటుంది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







