'విరాటపర్వం' మూవీ ఫ‌స్ట్ లుక్

- December 14, 2020 , by Maagulf
\'విరాటపర్వం\' మూవీ ఫ‌స్ట్ లుక్

హైదరాబాద్‌: రాణా పుట్టిన రోజు సందర్భంగా విరాటపర్వం ఫస్ట్‌లుక్‌ను సోమవారం రిలీస్‌ చేసింది చిత్రయూనిట్‌.మరోవైపు  టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత అక్కినేనా రానా స్పెషల్‌ డీపీని రిలీజ్‌ చేశారు. దీంతో ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు.  సెలబ్రిటీలనుంచి, ఫాన్స్‌దాకా సోషల్‌ మీడియాలో రానాకు పుట్టిన రోజు శుభాకాంక్షల సందేశాల వెల్లువ జోరుగా కొనసాగుతోంది.  కాగా బ్లాక్‌బస్టర్‌ బాహుబలి మూవీ లోని బల్లాలదేవతో తనప్రత్యేకతను ప్రపంచ వ్యాప్తంగా చాటుకున్న రానా ప్ర‌స్తుతం విరాట ప‌ర్వం  సినిమాతో మరోసారి భారీ హైప్‌ క్రియేట్‌ చేస్తున్నసంగతి తెలిసిందే. మ‌రి కొద్ది నిమిషాల‌లో మూవీకి సంబంధించి టీజ‌ర్ కూడా రానుంది.

ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకుడు. ఈ సినిమాలో నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావ్‌, సాయిచంద్‌, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ  హైద‌రాబాద్‌లో  షూటింగ్‌ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ మూవీ  వచ్చేఏడాది విడుదల చేయాలని యూనిట్‌ ప్లాన్ చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com