మనీ లాండరింగ్‌, కమర్షియల్‌ ఫ్రాడ్‌: ఇద్దరికి జైలు

- December 14, 2020 , by Maagulf
మనీ లాండరింగ్‌, కమర్షియల్‌ ఫ్రాడ్‌: ఇద్దరికి జైలు

సౌదీ: జెద్దా క్రిమినల్‌ కోర్టు ఓ బిజినెస్‌ ఓనర్‌ అలాగే ఓ ఉద్యోగికి మొత్తం 9 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. మనీ లాండరింగ్‌ అలాగే యాంటీ బిజినెస్‌ లైసెన్సింగ్‌ ఫ్రాడ్‌ నేపథ్యంలో నిందితులకు ఈ శిక్ష విధించడం జరిగింది. కాగా, 28 మిలియన్‌ రియాల్స్‌ని స్వాధీనం చేసుకునేలా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సౌదీ ఫైనాన్షియల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌, ఓ కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ తాలూకు బ్యాంక్‌ అకౌంట్‌పై నిఘా వుంచింది. జనరల్‌ కస్టమ్స్‌ అథారిటీ ద్వారా సదరు సంస్థకి చెందిన ఇంపోర్ట్స్‌ వాల్యూమ్‌ గురించిన సమాచారం సేకరించడం జరిగింది. ఈ క్రమంలో సదరు బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా బ్రోకరేజ్‌ చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ - డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ క్రైమ్‌, లోతైన విచారణ చేసి, నిందితుల్ని న్యాయస్థానం ముందుంచడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com