17న భారత్‌-బంగ్లా ప్రధానుల వర్చువల్‌ సమావేశం

- December 14, 2020 , by Maagulf
17న భారత్‌-బంగ్లా ప్రధానుల వర్చువల్‌ సమావేశం

న్యూఢిల్లీ: ఈనెల 17న ప్రధాని నరేంద్రమోడి బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో భేటీ కానున్నారు. వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో ఈ స‌మావేశం జ‌రుగ‌నుంది. ఈ సందర్భంగా నేత‌లిద్ద‌రూ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల‌పై స‌మ‌గ్ర‌మైన చ‌ర్చ జ‌రుప‌నున్నారు. వివిధ రంగాల్లో ప‌ర‌స్ప‌ర సహ‌కారానికి సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. కొవిడ్‌ అనంత‌రం రెండు దేశాల మ‌ధ్య స‌హ‌కారాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకునే అంశంపై కూడా ఈ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ది. ఈ భేటీకి సంబంధించిన స‌మాచారాన్ని భార‌త విదేశాంగ శాఖ వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com