రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్..
- December 14, 2020
విజయవాడ:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు... మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్న ఆయన.. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీకానున్నారు ఏపీ సీఎం.. వరదలతో నష్టపోయిన ఏపీకి పరిహారం చెల్లించాల్సిందిగా రెండు రోజుల క్రితమే కేంద్రానికి లేఖరాసిన సీఎం జగన్.. ఈ నేపథ్యంలోనే అమిత్‌షాను కలవబోతున్నారు. రాష్ట్రవిభజకు సంబంధించిన పెండింగ్ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన సమస్యల పరిష్కారంపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు. కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన ముగిసే వెంటనే.. ఏపీ సీఎం ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష