కువైట్‌ లేబర్‌ చట్టాలు: వర్చువల్‌ ఓపెన్‌ హౌస్‌ నిర్వహించనున్న ఎంబసీ

- December 15, 2020 , by Maagulf
కువైట్‌ లేబర్‌ చట్టాలు: వర్చువల్‌ ఓపెన్‌ హౌస్‌ నిర్వహించనున్న ఎంబసీ

కువైట్ సిటీ:కువైట్‌లో ఇండియన్‌ ఎంబసీ, 'కువైట్‌ లేబర్‌ చట్టాల'పై వర్చువల్‌ ఓపెన్‌ హౌస్‌ని డిసెంబర్‌ 23 మధ్యాహ్నం 3.30 నిమిషాలకు నిర్వహించనుంది. రాయబారి శిబి జార్జి ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కువైట్‌ లేబర్‌ చట్టాలపై సెమినార్‌ కూడా నిర్వహిస్తారు. భారత జాతీయులెవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఆసక్తికలిగినవారు తమ వివరాల్ని పంపడం ద్వారా ఈ కార్యక్రమానికి రిజిస్టర్‌ చేసుకోవచ్చు. పూర్తి పేరు, పాస్‌పోర్టు నెంబర్‌, సివిల్‌ ఐడీ నెంబర్‌ అలాగే కాంటాక్ట్‌ నంబర్‌, అడ్రస్‌ వంటి వివరాల్ని [email protected] అడ్రస్ కి ఈ-మెయిల్‌ చేయాల్సి వుంటుంది. రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక, వారికి మీటింగ్‌ ఐడీ ఇతర వివరాల్ని పంపిస్తారు.  

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com