`118` దర్శకుడు కేవి గుహన్ కొత్త చిత్రం `డబ్లూడబ్లూడబ్లూ`
- December 15, 2020_1608034992.jpg)
హైదరాబాద్:`118` వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్నితెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ తన తదుపరి చిత్రంగా మరో డిఫరెంట్ థ్రిల్లర్‌ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి `డబ్లూడబ్లూడబ్లూ`(హూ,వేర్,వై) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అథిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నఈ మూవీని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి. రాజు దట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్నఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఈ చిత్రం టైటిల్‌లోగోను విడుదలచేయనున్నారు. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత డా. రవి పి.రాజు దట్ల మాట్లాడుతూ - ``కేవి గుహన్ గారు తెరకెక్కించిన 118 మూవీ ఎంతపెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన రెండో చిత్రంగా ఒక డిఫరెంట్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో `డబ్లూడబ్లూడబ్లూ` మూవీని రూపొందిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ బేనర్లో హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ మూవీ రూపొందుతోంది. సిమన్ కె. కింగ్ సంగీత సారథ్యం వహిస్తుండగా మిర్చికిరణ్ పవర్ఫుల్ డైలాగ్స్ అందిస్తున్నారు. టెక్నికల్‌గా మంచి టీమ్ కుదిరింది. త్వరలోనే టైటిల్ లోగోని విడుదలచేస్తాం`` అన్నారు.
అథిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి
సంగీతం: సిమన్ కె. కింగ్,
ఎడిటింగ్: తమ్మిరాజు,
డైలాగ్స్: మిర్చికిరణ్,
కొరియోగ్రఫి: ప్రేమ్ రక్షిత్ మాస్టర్,
కో-ప్రొడ్యూసర్: విజయ్ ధరణ్ దట్ల,
నిర్మాత: డా. రవి పి.రాజు దట్ల ,
కథ, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కేవి గుహన్.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు