కువైట్:కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం భారీగా రిజిస్ట్రేషన్లు
- December 16, 2020
కువైట్ సిటీ:కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకునేందుకు కువైట్ పౌరులు, ప్రవాసీయుల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకునేవారు ముందుగా మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కొద్ది రోజుల ముందే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వెబ్ సైట్ ద్వారా అంచాలకు మించి ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. ఈ పరిణామం కువైట్ పౌరుల్లో, ప్రవాసీయుల్లో ఆరోగ్యంపై అవగాహన, శ్రద్ధ పెరిగిందని చెప్పేందుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. మరోవైపు అత్యవసర ప్రతిపాదికన తుది అనుమతులు పొందిన ఫైజర్ వ్యాక్సిన్ అతి త్వరలోనే కువైట్ చేరుకోనుంది. వ్యాక్సిన్ రాగానే ప్రధాన్యత ప్రకారం ప్రజలకు అందించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతోంది. ఎగ్జిబిషన్ హాల్ లో ఇప్పటికే వ్యాక్సిన్ ను భద్రపరిచేందుకు అవసరమైన శీతలీకరణ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఒకట్రెండు రోజుల్లో థర్మల్ స్క్రీనింగ్, సిబ్బందికి ప్రత్యేక గదులు, ఇతరాత్ర సాహాయక సిబ్బంది ఎగ్జిబిషన్ హాల్ కు చేరుకుంటారని అధికారులు వివరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







