తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్ కేసులు
- December 16, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గతంలో ప్రతి రోజు పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల వరకు నమోదు కాగా, తాజాగా పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 536 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 2,79,135 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం 1502 మంది కరోనాతో మరణించారు. ఇక తాజాగా 622 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు 2,70,450 మంది కోలుకున్నారు.
మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 7,183 ఉండగా, హోం ఐసోలేషన్ లో 5,041 మంది చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. రాష్ట్రంలో రికవరీ రేటు 96.88 శాతం ఉండగా, దేశంలో 95.2 శాతం ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 107 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







