విమాన సిబ్బందిని కోవిడ్ వారియర్స్‌గా గుర్తించండి-IATA
- December 16, 2020
న్యూ ఢిల్లీ:విమానయాన రంగంలో పనిచేసే సిబ్బందిని కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని ది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రపంచ దేశాలను కోరింది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో విమాన సిబ్బందిని సైతం కరోనా వారియర్స్‌గా పరిగణించాలని కోరింది. వ్యాక్సిన్ను దేశదేశాలకు సరఫరా చేసేందుకు 8 వేల బోయింగ్ 747 విమానాలు అవసరం కానున్నాయని, వ్యాక్సిన్ తరలింపునకు వేలాది మంది విమాన సిబ్బంది అవసరమైతారని అసోసియేషన్ సీఈఓ జునిక్ తెలిపారు. ప్రపంచానికి వ్యాక్సిన్ సరఫరాలో కీలకం కానున్న నేపథ్యంలోనే విమాన సిబ్బందిని కోవిడ్ వారియర్స్‌గా పరిగణించాలని కోరారు. కాగా ది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ వ్యాక్సిన్ తరలింపు విషయంలో వర్డల్ హెల్త్ ఆర్గనైజేషన్‌తో కలిసి పని చేయనుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష