రద్దయిన, సరిగ్గా పూర్తికాని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల కోసం కమిటీ

- December 16, 2020 , by Maagulf
రద్దయిన, సరిగ్గా పూర్తికాని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల కోసం కమిటీ

దుబాయ్‌:పూర్తిస్థాయిలో పూర్తికాని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు, రద్దయిన ప్రాజెక్టులకు సంబంధించి దుబాయ్‌, ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తోంది. యూఏఈ వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్‌ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ జారీ చేసిన ఓ డిక్రీని జారీ చేశారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌ జ్యుడీషియల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌, కొత్త స్పెషల్‌ రటైబ్యునల్‌కి సంబంధించి ఛైర్మన్‌ అలాగే మెంబర్స్‌ని నియమిస్తారు. ఈ కమిటీ, ఆయా నిర్మాణాల పరిస్థితిని అధ్యయనం చేసి, తగు చర్యలు చేపడుతుంది. ఒకవేళ నిర్మాణదారుడు, నిబంధనలకు లోబడి ప్రాజెక్టుని పూర్తి చేయలేకపోతే, వినియోగదారులకు పూర్తిగా వారు చెల్లించిన సొమ్ముని తిరిగి ఇచ్చేయాల్సి వుంటుంది. డిక్రీలోని మరో నిబంధన ప్రకారం, రద్దయిన, సరిగ్గా పూర్తికాని ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి కేసుల్నీ విచారణకు స్వీకరించకూడదు. వివాదాల పరిష్కారంలో ట్రైబ్యునల్‌కి రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com