తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న సూపర్ హిట్ వెబ్ సిరీస్ బాండిష్ బాండిట్స్
- December 16, 2020
ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ టాక్ అందుకున్న అమెజాన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ బాండిష్ బాండిట్స్ ఇప్పుడు భారతదేశవ్యాప్తంగా అభిమానుల కోసం తమిళం మరియు తెలుగులో కూడా లభ్యం కానుంది. అమృత్ పాల్ సింగ్ బింద్రా (బ్యాంగ్ బాజా బరాత్) నిర్మాణ సారథ్యంలో ఆనంద్ తివారీ (లవ్ పర్ స్వ్కేర్ ఫుట్) ద ర్శకత్వంలో తెరకెక్కిన ఫేమస్ వెబ్ సిరీస్ బాండిష్ బాండిట్స్. పాప్ మరియు క్లాసికల్ ఇలా రెండు విభిన్న సంగీత నేపథ్యాల్లో పెరిగి పెద్దయిన ఇద్దరు సంగీత కళాకారుల కథ ఇది. ఈ పది భాగాల సిరీస్ లో రిత్విక్ భౌమిక్ (దుసార్) హిందుస్థానీ క్లాసికల్ గాయకుడు రాధేగా, శ్రేయ చౌదరి (డియర్ మాయా) పాప్ స్టార్ తమన్నాగా నటించారు. నసీ రుద్దీన్ షా (ఎ వెడ్ నెస్ డే, ది లీగ్ ఆఫ్ ఎక్స్ ట్రార్డినరీ జంటిల్ మెన్), అతుల్ కుల్ కర్ణి (పేజ్ 3, రంగ్ దే బసంతి), కునాల్ రాయ్ కపూర్ (లవ్ పర్ స్వ్కేర్ ఫుట్, ఢిల్లీ బెల్లీ), షీబా చద్దా (మీర్జాపూర్, తలాష్) మరియు రాజేశ్ తైలంగ్ (మీర్జాపూర్, ది సెకండ్ బెస్ట్ ఎగ్జోటిక్ మారిగోల్డ్ హోటల్) వంటి ప్రముఖ తారలు కూడా ఇందులో నటించారు. ఈ షో తోనే ప్రముఖ సంగీత దర్శకులు శంకర్ ఇషాన్ లాయ్ డిజిటిల్ మీడియంలోకి ఎంట్రీ ఇచ్చారు. భారత్ మరియు 200కు పైగా దేశాలు, టెరిటరీస్ లకు చెందిన ప్రైమ్ సభ్యులు ఇప్పుడు డిసెంబర్ 16 నుంచి ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో లో బాండిష్ బాండిట్స్ ను తమిళం మరియు తెలుగులో కూడా చూడవచ్చు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు