ఫ్రైడే మూవీస్ - ప్రేక్షకుల ఇంటివద్దకే సినిమా థియేటర్
- December 17, 2020
ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో శ్రవణ్ రెడ్డి ని తెలుగులో హీరోగా పరిచయం చేస్తూ సస్పెన్స్ తో కూడిన రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం 'డర్టీ హరి'. ఈ నెల 18న ఫ్రైడే మూవీస్ ATT యాప్ పై ఈ చిత్రాన్ని విడుదల కానుంది.

ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మరియు హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిమ్రత్ కౌర్, రుహాని శర్మలు ఇందులో హీరోయిన్లు గా నటించారు. ఈ సందర్భంగా ఫ్రైడే మూవీస్ యాప్ తరుపన అనురాగ్ పర్వతనేని, విజయ్ మద్దూరి మీడియా సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా ఫ్రైడే యాప్ ప్రమోటర్స్ విజయ్ మద్దూరి, అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ...కరోనా ప్యాండమిక్ వలన అందరూ ఇళ్ళకు పరిమితమైయ్యారు. ఇప్పడిప్పుడే కొంతవరకూ పరిస్ఠితులు మారుతున్నాయి. జనసంచారం వున్న ప్రదేశాలకు వెళ్ళాలంటే ఇంకా మనసులో భయం మాత్రం తగ్గటం లేదు. ఈ తరుణం లో అందరికి అందుబాటులో వుండేలా ఒక ఏటిటి సిద్దమైంది. మీ ఇంటికే వచ్చి మంచి సినిమాల్ని మీఇంట్లో మీకు సర్వ్ చేయబోతుంది. ప్రతి శుక్రవారం వచ్చిందంటే ఏ సినిమా విడుదలవుతుందో పేపర్స్ లో చూసుకుని టికెట్స్ బుక్ చేసుకుని ట్రాఫిక్ లో దియెటర్ కి వెళ్ళి పార్కింగ్ చేసుకునేలోపు సినిమా స్టార్టవుతుందేమో అనే కంగారు ఇక నుండి లేకుండా ఇక నుండి ఫ్రైడే మూవీస్ మీ ముందుకు వస్తుంది. దీనికోసం మీరేమి చెయ్యాలంటే 7997666666 నెంబర్ కి సింగిల్ మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ మోబైల్ లో ఫ్రైడే మూవీస్ యాప్ చేరుతుంది. మీ ఆనందాన్ని మీ మోబైల్ లో వుంచుతుంది. అలానే ఈ యాప్ ద్వారా డర్టీ హరి సినిమా చూడాలనుకునే వారు 120 రూపాయలు టిక్కెట్ ధర చెల్లించవలసి ఉంటుంది, ప్రతి వారం కొత్త సినిమాల తో పాటు సర్ప్రైజ్ చేసే మరికొన్ని అంశాలుంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







