GMR వరలక్ష్మి ఫౌండేషన్‌లో కోవిడ్ సవాళ్లను ఎదుర్కొంటూ పలు ఆన్ లైన్ కోర్సులు పూర్తి

- December 17, 2020 , by Maagulf
GMR వరలక్ష్మి ఫౌండేషన్‌లో కోవిడ్ సవాళ్లను ఎదుర్కొంటూ పలు ఆన్ లైన్ కోర్సులు పూర్తి

 హైదరాబాద్: జీఎమ్ఆర్ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగం జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ (GMRVF) లాక్-డౌన్ దశలో నిరుపేద వర్గాల కోసం ‘బ్లెండెడ్ లెర్నింగ్ మెథడ్’‌లో ఆన్‌లైన్ నైపుణ్య ఆధారిత కోర్సులను ప్రవేశపెట్టింది. గత 6 నెలల్లో 9 వేర్వేరు కోర్సులలో రెండు బ్యాచుల థియరీ, డెమో సెషన్‌లు పూర్తయ్యాయి. అనేక కోర్సులకు ప్రాక్టికల్ శిక్షణ అవసరం కాబట్టి, కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలలో వొకేషనల్ ట్రెయినింగ్ సెంటర్లను తెరవడానికి అనుమతించిన తర్వాత ఈ కోర్సులకు ప్రాక్టికల్ శిక్షణ నవంబర్‌లో ప్రారంభమైంది.

మొదటి బ్యాచ్ విద్యార్థులు ఇటీవలే శంషాబాద్, రాయికల్, నాగరంలోని GMRVCEL (జిఎంఆర్ వరలక్ష్మి సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ అండ్ లైవ్లిహుడ్స్) కేంద్రాలలోని స్కిల్ బేస్డ్ కోర్సులను పూర్తి చేశారు. సంబంధిత ప్రభుత్వ అధికారుల అనుమతి పొందిన తరువాత తెలంగాణలోని GMRVF కేంద్రాలు వివిధ కోర్సుల ప్రాక్టికల్స్‌ను ప్రారంభించాయి.

ఎలక్ట్రికల్, ఎసి టెక్నీషియన్, ఎక్స్‌కవేటర్ ఆపరేటర్, వెల్డింగ్, ప్లాస్టార్ బోర్డ్ అండ్ ఫాల్స్ సీలింగ్, టూ వీలర్ టెక్నీషియన్, కంప్యూటర్, కుట్టు మెషిన్ ఆపరేటర్, హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల నుంచి 90 మంది విద్యార్థులకు GMRVCEL శంషాబాద్ సెంటర్ ప్రాక్టికల్ క్లాసులు నిర్వహించింది. GMRVCEL రాయ్‌కల్ సెంటర్లో 32 మంది విద్యార్థులకు టైలరింగ్, ఎలక్ట్రికల్, ద్విచక్ర వాహనాల మరమ్మత్తు ప్రాక్టికల్ కోర్సులను నిర్వహించారు. GMRVCEL నాగరం కేంద్రం ఎలక్ట్రీషియన్, హోమ్ హెల్త్ ఎయిడ్ కోర్సులలో 25 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. 

అన్ని ప్రాక్టికల్ కోర్సులను కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలతో నిర్వహిస్తున్నారు. సామాజిక దూరాన్ని పాటించేలా సగం సామర్థ్యంతో బ్యాచ్‌లు ప్రారంభించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సూపర్‌వైజర్లతో సహా ప్రాక్టికల్ తరగతులకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించడం, హ్యాండ్ శానిటైజేషన్‌తో పాటు అన్ని కేంద్రాల్లో తప్పనిసరి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. సామాజిక దూరాన్ని పాటించడానికి హాస్టల్, ఇతర చోట్ల కోవిడ్ భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 

GMRVF ఎసి టెక్నీషియన్ కోర్సు కోసం వోల్టాస్‌తో కొలాబరేషన్ కలిగి ఉంది; ఎలక్ట్రీషియన్ కోర్సు కోసం ష్నైడర్ ఎలక్ట్రిక్, డ్రైవాల్ & ఫాల్స్ సీలింగ్ కోర్సు కోసం ఎవరెస్ట్; ఎక్స్కవేటర్ ఆపరేటర్ కోర్సు కోసం వోల్వో; ద్విచక్ర వాహన సాంకేతిక నిపుణుల కోర్సు కోసం హీరో మోటో కార్ప్ డీలర్లతో కొలాబరేషన్ కలిగి ఉంది. ఇతర కోర్సులకు, వివిధ పరిశ్రమలలో బలమైన ప్లేస్‌మెంట్ వ్యవస్థ కలిగిన టై-అప్‌లను కలిగి ఉంది.   

2020 డిసెంబర్ 28 నుండి బాలికల కోసం కంప్యూటర్ కోర్సు, టైలరింగ్; హోటల్ మేనేజ్‌మెంట్, ఎసి టెక్నీషియన్, టూ వీలర్ టెక్నీషియన్ కోర్సులు ప్రారంభించాలని GMRVF సెంటర్ యోచిస్తోంది. ఇవే కాకుండా డిసెంబర్ 1 నుంచి గతంలో శిక్షణ పొందిన ఎసి నిపుణుల కోసం రిఫ్రెషర్ కోర్సును కూడా నిర్వహించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com