19, 20 తేదీల్లో సీసీవిఏ అంతర్జాతీయ అంతర్జాల కవి సమ్మేళనం
- December 17, 2020
విజయవాడ:ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విభిన్న భాషలలోని కవితా సౌందర్యాన్ని అంతర్జాతీయ స్ధాయిలో పరిచయం చేయటమే ధ్యేయంగా అమరావతి అంతర్జాల అంతర్జాతీయ కవితా సమ్మేళనం-2020 నిర్వహిస్తున్నట్లు కవి సమ్మేళనం కన్వీనర్,ఆంధ్ర ప్రదేశ్ భాష సాంస్కృతిక శాఖ మాజీ సంచాలకులు డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ తెలిపారు. వివిధ భాషలలోని సృజనాత్మక వైవిధ్యాన్ని, అభివ్యక్తిలోని సారూప్యవిభేదాన్ని పరస్పరం పరిచయం చేసుకునేలా సమ్మేళాన్ని రూపకల్సన చేసామన్నారు. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి నేతృత్వంలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం (నెల్లూరు), ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖల సంయుక్త సహకారంతో 19, 20 తేదీల్లో 6వ అంతర్జాతీయ కవి సమ్మేళనం-2020 నిర్వహిస్తున్నట్టు విజయభాస్కర్ తెలిపారు. విజయవాడ మధుమాలక్ష్మీ ఛాంబర్స్ లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యక్రమం గురించిన వివరాలను ప్రకటించారు.
ఈ సందర్భంగా విజయ భాస్కర్ మాట్లాడుతూ గతంలో ప్రపంచ వ్యాప్తంగా కవులను విజయవాడకు ఆహ్వానించి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూరాగా, కరోనా కారణంగా ఈసారి వెబినార్ విధానాన్ని ఎంచుకున్నామన్నారు. కల్చరల్ సెంటర్ ఛైర్ పర్శన్ డాక్టర్ తేజస్విని అధ్యక్షతన విజయవాడ కేంద్రంగా ప్రధాన కార్యక్రమం జరగనుండగా, ప్రపంచ వ్యాప్తంగా సదస్సు కోసం నమోదు అయిన 162 మంది కవులు వారి దేశాల నుండి ఆన్ లైన్ విధానంలో కార్యక్రమంలో పాలుపంచుకుంటారన్నారు. సరస్వతీ సమ్మాన్, కబీర్ సమ్మాన్ గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ కేంద్ర కమిటీ సభ్యులు కె. శివారెడ్డి 19వ తేదీ ఉదయం 10 గంటలకు కవిసమ్మేళనాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. గుజరాత్ సాహిత్య అకాడెమీ ఛైర్మన్ పద్మశ్రీ విష్ణు పాండ్య, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ ఎన్. గోపి, డాక్టర్ పాపినేని శివశంకర్, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ మునిరత్నం నాయుడు, రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ళ మల్లికార్జునరావు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ విశిష్ట అతిథులుగా పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు.
కల్చరల్ సెంటర్ సిఇఓ, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ 31 దేశాల నుంచి వారి భాషల్లోనూ, మనదేశం నుంచి 20 భాషల్లోనూ కవులు పర్యావరణం అంశం పై ఈ సమావేశాల్లో తమ కవితలను రెండు రోజులపాటు అలపించి శ్రోతలను అలరిస్తారన్నారు. మాలక్ష్మీ ప్రాపర్టీస్ సీఐఓ సందీప్ మండవ మాట్లాడుతూ 20వ తేదీ సాయంత్రం జరిగే సమాపన సమావేశానికి మూర్తిదేవి పుస్కార గ్రహీత పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ముఖ్య అతిధిగా హాజరు కానుండగా కేంద్ర సాహిత్య అకాడమీ (అనువాద) అవార్డు గ్రహీత డాక్టర్ వెన్నా వల్లభరావు, సీనియర్ ఐపిఎస్ అధికారి కిల్లాడ సత్యనారాయణ, కల్చరల్ సెంటర్ ఛైర్ పర్శన్ డాక్టర్ తేజస్విని హాజరవుతారని తెలిపారు. కవి సమ్మేళన సమన్వయకర్త, ది సెడిబస్ సిఇఓ దీపా బాలసుబ్రమణియన్ మాట్టాడుతూ ఔత్సాహిక కవులు, రచయుతలు జూమ్ యాప్ మీటింగ్ ఐడి: 93984587444, పాస్ వర్డ్ : 914434 ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







