ఆఫ్గనిస్తాన్ లో భారీ పేలుళ్లు, 15 మంది మృతి
- December 18, 2020
ఆఫ్గనిస్తాన్ లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 15 మంది మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన ఆఫ్ఘన్ లోని ఘాజీ ప్రావిన్స్ లోని గెలాన్ జిల్లాలో జరిగింది. గెలాన్ జిల్లాలోని ఓ ఇంట్లో కొంతమంది వ్యక్తులు గుమిగూడి ఉన్నారు. ఆ సమయంలో పేలుళ్లు సంభవించాయి. పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉన్న సమయంలో పేలుళ్లు సంభవించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రమాదవశాత్తు పేలుళ్లు జరిగాయా లేదంటే, ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారా అనే దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆఫ్గనిస్తాన్ లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఎక్కడ ఎలాంటి పేలుళ్లు జరుగుతాయో అని ప్రజలు భయపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష