ఏపీ లో కరోనా కేసుల వివరాలు...
- December 18, 2020
అమరావతి:ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది.రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి.ప్రస్తుతం ఏపీలో 500 కంటే తక్కువగా కేసులు నమోదవుతున్నాయి.పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతున్నా, జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 458 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,77,806కి చేరింది.ఇందులో 8,66,359 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,377 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఒక్కరు మృతి చెందారు.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మృతుల సంఖ్య 7070కి చేరింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







