ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకులపై పోలీసుల ఉక్కుపాదం!
- December 19, 2020
హైదరాబాద్:ఆన్లైన్లో ఈజీగా లోన్లు ఇచ్చి వడ్డీలపై వడ్డీలతో జనం ఉసురుతీస్తున్న లోన్ యాప్స్ పై పోలీసులు కొరఢా ఝుళిపిస్తున్నారు. లోన్ యాప్స్ నిర్వాహకుల ఆగడాలు పెరిగిపోవడంతో వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆన్లైన్ లోన్ యాప్స్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. అడ్డగోలుగా వడ్డీలు వసూలు చేసి యువత జీవితాలతో ఆడుకుంటున్న ఓ వ్యక్తిని సైబారాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్పూర్లో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో రెండు రోజుల క్రితం సునీల్ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాప్ ద్వారా అప్పులు చేసి చెల్లించలేకపోయాడు. దీంతో సునీల్‌ను యాప్ నిర్వాహకులు వేధించడం మొదలు పెట్టారు. కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారివద్ద సునీల్‌ను తీవ్రంగా అవమాన పరిచారు. పరువుపోయిందని భావించిన సునీల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సైబారాబాద్ పోలీసు ఓ యవకుడిని పట్టుకున్నారు. నిందితుడు నాలుగు యాప్‌లు సృష్టించి రుణాలు ఇస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ యువకుడిని రహస్యప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నారు. అతడి బ్యాంక్ ఖాతాల్లో నగదు నిల్వలను పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష