ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో వలస కార్మికుల దినోత్సవ వేడుకలు
- December 19, 2020
మస్కట్:వలస కార్మికులందరికి 18 డిసెంబర్ ప్రపంచ 30వ వలస కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు.వలస కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒమన్ లో ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో వలస కార్మికుల దినోత్సవం జరపడం జరిగింది.గల్ఫ్ బోర్డు కోసం ప్లే కార్డ్స్ తో గల్ఫ్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వం ను విజ్ఞప్తి చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు మాట్లాడుతూ గల్ఫ్ లో ఉండే సమస్యలు రాను రాను పెరుగుతున్నాయి.ముందు గల్ఫ్ అంటే ఒక స్వర్గధామం లాగా ఉండేది గతం లో కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ముఖ్యంగా కోవిడ్ కారణంగా ఇంకా కార్మికుల పరిస్థితిలు దారుణంగా ఉన్నాయి.గల్ఫ్ లో ఉన్న ప్రతి కార్మికుడు గల్ఫ్ బోర్డు కు మద్దతు తెలుపుదాం.గల్ఫ్ జేఏసీ ద్వారా నే గల్ఫ్ బోర్డు సాధించడానికి అవకాశం ఉంది గల్ఫ్ లో ఉన్నటువంటి ముఖ్యంగా 18 గల్ఫ్ సంఘాలు గల్ఫ్ జేఏసీ లాగా ఏర్పడి గల్ఫ్ బోర్డు సాధన దిశగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రపంచ వలస కార్మికుల దినోత్సవం సందర్బంగా గల్ఫ్ లో మరియు మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికునికి నా విజ్ఞప్తి గల్ఫ్ జేఏసీ కి మద్దతు ఇచ్చి గల్ఫ్ జేఏసీ ద్వారానే మన గల్ఫ్ బోర్డు సాధిద్దాం.గల్ఫ్ బోర్డు సాధించుకుంటేనే ఇక్కడ గల్ఫ్ లో ఉన్న గల్ఫ్ కార్మికుల జీవితాలు బాగుపడతాయి.గల్ఫ్ బోర్డు కోసం గల్ఫ్ జేఏసీ కి మద్దతు ఇవ్వండి.
ఈ కార్యక్రమంలో ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు మరియు కుమార్ మచికట్ల,వేమన్ కుమార్,మామిడి శ్యామ్ కుమార్, చేని గురువయ్య,చేని ప్రభాకర్, కార్తీక్, రమేష్ గరిగె, సుద్దాల గంగరాజం, రాజు మిగతా ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు