6 నకిలీ వెబ్‌సైట్లు...
- December 19, 2020
న్యూ ఢిల్లీ:దొంగలు ఇంటికి వచ్చే దోచుకునే రోజులు పోయాయి.. ఇప్పుడు దొంగలు చాలా తెలివైన వారు.. ఉన్న చోటు నుంచే ఊడ్చేస్తున్నారు. అకౌంట్‌లో డబ్బుని ఖాళీ చేస్తున్నారు. టెక్నాలజీని బాగా వంటబట్టించుకుంటున్న సైబర్ నేరగాళ్లు చోర కళలో ఆరి తేరుతున్నారు. అందులో భాగంగానే నకిలీ వెబ్‌సైట్లను తయారు చేసి వాటినే అసలు సైట్లుగా నమ్మించి జనాలను మోసం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈ సైట్లలో ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, స్కాలర్‌షిప్‌లను ఇస్తామని మభ్య పెడుతున్నారు. దీంతో వాటిని ఓపెన్ చేసిన వారు నిజమే అని నమ్మి వాటిల్లో తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేసి అడ్డంగా బుక్కవుతున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ విధంగా క్రియేట్ చేసిన నకిలీ సైట్లను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PBI) గుర్తించింది. అవి..
https://centralexcisegov.in/aboutus.php
https://register-for-your-free-scholarship.blogspot.com/
https://kusmyojna.in/landing/
https://www.kvms.org.in/
https://www.sajks.com/about-us.php
http://register-form-free-tablet.blogspot.com/
ఈ 6 సైట్లతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వాటని నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







