‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్ విడుదల
- December 19, 2020
హైదరాబాద్:సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా సుబ్బ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ . నభా నటేశ్ హీరోయిన్. ఈ చిత్రం మరో ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేషన్‌తో డిసెంబర్ 25న విడుదలవుతుంది. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్ విషయానికి వస్తే..
ప్రజలు ఆగ్రహాంతో సాయితేజ్ కటౌట్‌కి మంట పెడతారు. దాని గురించి చెబుతూ సాయితేజ్ వాయిస్‌తోనే ట్రైలర్ ప్రారంభమైంది.
‘‘మన రాజ్యాంగం మనకు స్వేచ్చగా బతకమని కొన్ని హక్కులను ఇచ్చింది. వాటిని మనం ఈ ప్రేమ, పెళ్లి అనే కమిటెడ్ రిలేషన్స్‌తో నాశనం చేస్తున్నాం’’ అని సాయితేజ్ డైలాగ్‌తో తన క్యారెక్టర్ ఎలా ఉంటుందనే దానిపై క్లారిటీ ఇచ్చారు.
‘‘సినిమా హాల్లో సిగరెట్‌కి, మందుకి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తారు కదా, అలాగే పెళ్లికి, పెళ్లానికి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలి’’ అంటూ రావు రమేశ్, సాయితేజ్‌కి చెప్పే డైలాగ్‌తో రావు రమేశ్, సాయితేజ్ మధ్య ఉన్న మామ, అల్లుడు బంధాన్ని ఎలివేట్ చేశారు.
ఓ సందర్భంలో నభా నటేశ్.. మీరు నా పక్కనుంటే బావుంది సార్ అని డైలాగ్ చెబుతూ వాటేసుకునే సన్నివేశం, మరో సన్నివేశంలో నువ్వు పెద్ద మోసగాడివి అంటూ తిట్టడం కూడా ట్రైలర్‌లో చూడొచ్చు.
‘‘మనిషి ప్రకృతి ధర్మాని పాటించాలి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. పెళ్లి చేసుకోవాలి’’ అంటూ ఆర్.నారాయణమూర్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలతో ట్రైలర్‌ను ఎండ్ చేశారు.
సోలో బ్రతుక్కి, మ్యారీడ్ లైఫ్‌కి మధ్య ఓ అబ్బాయి, అమ్మాయి జర్నీయే ఈ సినిమా అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే సినిమాలో అదెంత బాగా ప్రెజెంట్ చేశారనేది తెలియాలంటే మాత్రం డిసెంబర్ 25న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చూడాల్సిందే.
నటీనటులు:
సాయితేజ్, నభా నటేశ్, రావు రమేశ్, రాజేంద్రప్రసాద్, వెన్నెలకిషోర్, సత్య తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: సుబ్బు
నిర్మాత: బీవీఎస్ఎన్.ప్రసాద్
ఆర్ట్: అవినాష్ కొల్ల
ఎడిటర్: నవీన్ నూలి
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి.దిలీప్
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు