కొత్త కరోనా వైరస్: బోర్డర్స్‌ని మూసేసిన సౌదీ అరేబియా
- December 21, 2020
రియాద్: సౌదీ అరేబియా వారం రోజులపాటు అంతర్జాతీయ వాణిజ్య విమానాల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ కనుగొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు అలాగే సముద్రపు బోర్డర్స్‌ని కూడా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర విభాగాలకు సంబంధించి అంతర్జాతీయ ప్రయాణాలకు మాత్రం కాస్త వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ నిషేధం ఇంకో వారం పొడిగించే అవకాశాలు కూడా వున్నట్లు తెలుస్తోంది. యూరోపియన్ దేశాల నుంచీ అలాగే కొత్త స్ట్రెయిన్ వెలుగు చూసిన దేశాల నుంచి వచ్చినవారి కోసం ప్రత్యేకంగా కొన్ని నిబంధనల్ని జారీ చేశారు. డిసెంబర్ 8 తర్వాత వచ్చినవారు రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలో వుండాల్సి వుంటుంది. ప్రతి ఐదు రోజుల తర్వాత వారు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







