ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలనుకునే వారికి శుభవార్త

- December 21, 2020 , by Maagulf
ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలనుకునే వారికి శుభవార్త

హైదరాబాద్:ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునేవారికి హైదరాబాద్‌‌లోని రామకృష్ణ మఠం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్‌లో స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్‌లైన్ క్లాస్‌లను నిర్వహించనున్నట్టు తెలిపింది. బేసిక్, జూనియర్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను 2021 జనవరి 9 నుంచి ప్రారంభించనున్నట్టు పేర్కొంది. పదో తరగతి పాస్ అయినవారు, 17 ఏళ్లు నిండినవారు ఈ కోర్సుకు అర్హులుగా పేర్కొంది. ఆసక్తిగలవారు హైదరాబాద్ రామకృష్ణ మఠం వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. తెలుగు, హిందీ, ఉర్దూ వంటి ప్రాంతీయ భాషల్లో చదివిన విద్యార్థులు బేసిక్ కోర్సును ఎంచుకోవచ్చని సూచించింది. అలాగే ఇంగ్లీష్ మీడియం చదివిన విద్యార్థులు, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తున్న వారు జూనియర్ కోర్సును ఎంపిక చేసుకోవచ్చని సూచించింది.

డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 28 వరకు ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. శిక్షణ శిక్షణ రుసుము రూ. 1300గా నిర్ణయించారు. శిక్షణకు సంబంధించిన మెటిరియ‌ల్‌ను పోస్ట్ ద్వారా పంప‌నున్నారు. దరఖాస్తు చేసుకునే సమయంలో పాస్‌పోర్ట్ ఫొటోగ్రాప్‌ను అప్ ‌లోడ్ చేయడంతో పాటు ఇతర వివరాలు ఫిల్ చేయాల్సి ఉంటుందని చెప్పింది. కోవిడ్ నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నందన ఈ అవకాశాన్ని మారుమూల గ్రామాల‌ విద్యార్థులు, ఉద్యోగులు వినియోగించుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరారు.

ముఖ్యమైన అంశాలు..
తరగతుల ప్రారంభం-జనవరి 9, 2021
ఫీజు చెల్లింపు తేదీ- 7 డిసెంబర్ నుంచి 28 డిసెంబర్
ఫీజు- రూ. 1300
వెబ్‌సైట్-https://rkmathadmissions.winnou.net/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com