కొత్త కరోనా వైరస్‌‌:బోర్డర్స్‌ని మూసేసిన కువైట్

- December 21, 2020 , by Maagulf
కొత్త కరోనా వైరస్‌‌:బోర్డర్స్‌ని మూసేసిన కువైట్

కువైట్ సిటీ:నేటి నుండి  జనవరి 1వ తేదీ వరకు అంతర్జాతీయ వాణిజ్య విమానాల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌ కనుగొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.రోడ్డు‌ అలాగే సముద్రపు బోర్డర్స్‌ని కూడా మూసివేసినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తారిఖ్ అల్ ముజ్రిమ్ తెలిపారు. అత్యవసర విభాగాలకు సంబంధించి అంతర్జాతీయ ప్రయాణాలకు మాత్రం కాస్త వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ నిషేధం ఇంకో వారం పొడిగించే అవకాశాలు కూడా వున్నట్లు తెలుస్తోంది. యూరోపియన్‌ దేశాల నుంచీ అలాగే కొత్త స్ట్రెయిన్‌ వెలుగు చూసిన దేశాల నుంచి వచ్చినవారి కోసం ప్రత్యేకంగా కొన్ని నిబంధనల్ని జారీ చేశారు.డిసెంబర్‌ 8 తర్వాత వచ్చినవారు రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలో వుండాల్సి వుంటుంది. ప్రతి ఐదు రోజుల తర్వాత వారు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com