తెలంగాణ:గడిచిన 24 గంటల్లో 617 పాజిటివ్ కేసులు నమోదు..

- December 22, 2020 , by Maagulf
తెలంగాణ:గడిచిన 24 గంటల్లో 617 పాజిటివ్ కేసులు నమోదు..

హైదరాబాద్:తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 617 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,82,347 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,518 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 635 కాగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2,74,260కు చేరుకుంది.

రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. ఇక కోలుకున్నవారి శాతం రాష్ట్రంలో 97.17 శాతం ఉండగా, దేశంలో 95.6 శాతం ఉంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,569 మంది ఉండగా, హోం ఐసోలేషన్ లో 4,400 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా జీహెచ్ఎంసీలో 103 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ ) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com