నరేంద్ర మోదీకి అమెరికా అత్యున్నత పురస్కారం
- December 22, 2020
అమెరికా:ప్రధాని మోదీకి అమెరికా అత్యున్నత పురస్కారం’ లీజియన్ ఆఫ్ మెరిట్’ ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందజేశారు. భారత-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడంలో మోదీ నాయకత్వ ప్రతిభ అసమానమని ఆయన అన్నారు. కేవలం ఓ ప్రభుత్వ అధినేతకు మాత్రమే చీఫ్ కమాండ్ ఆఫ్ ది లీజియన్ అవార్డును అందజేస్తారు. గ్లోబల్ పవర్ లో ఇండియా అత్యున్నత శక్తిగా ఎదుగుతోందని, ప్రపంచ సవాళ్ళను ఎదుర్కోవడంలో ఉభయ దేశాల మధ్య వ్యూహాత్మక పెంపొందించేందుకు మోదీ చేస్తున్న కృషి అపారమని పేర్కొన్నారు. అమెరికాలో భారత రాయబారి తరన్ జిత్ సింగ్ సంధు వైట్ హౌస్ లో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రీన్ నుంచి స్వీకరించారు. మీ నాయకత్వానికి ఇది గుర్తింపు అని ట్రంప్ అన్నట్టు రాబర్ట్ ట్వీట్ చేశారు.
కాగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేలకు కూడా ఈ పురస్కారాలు లభించాయి. ఆ యా దేశాల రాయబారులు వీటిని అందుకున్నారు. భారత ప్రధానికి ఇలా అవార్డు అందజేసిన దేశాల్లో అమెరికా తాజా దేశమైంది. 2016 లో సౌదీ అరేబియా ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్, అదే సంవత్సరంలో ఘాజీ ఆమిర్ అమానుల్లాఖాన్ స్టేట్ ఆర్డర్, 2018 లో గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డు. 2019 లో యూఏఈ ఆర్డర్ ఆఫ్ ది జాయెర్ అవార్డు. అదే ఏడాది రష్యా ఆర్డర్ ఆఫ్ ఎండ్రు పురస్కారంతో బాటు ఆ సంవత్సరంలోనే మాల్దీవుల అత్యున్నత పురస్కారం కూడా లభించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







