కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న బైడెన్
- December 22, 2020
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ మాట నిలబెట్టుకున్నారు. ప్రజల మధ్యలో కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకుంటాను అన్న బైడెన్ దాన్ని నిజం చేసి చూపారు. బైడెన్ సోమవారం క్రిస్టియానాకేర్ ఆస్పత్రిలో బహిరంగంగా ఫైజర్ బయోఎన్‌టెక్ కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రజలు ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా దాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇలా బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకున్నాను’ అన్నారు. క్రిస్టియానాకేర్ ఆసుపత్రిలో నర్సు ప్రాక్టీషనర్, ఎంప్లాయీ హెల్త్ సర్వీసెస్ హెడ్ తబే మాసా బైడెన్‌కి వ్యాక్సిన్ వేశారు. నూతన అధ్యక్షుడి భార్య డాక్టర్ జిల్ బిడెన్ ఇప్పటికే వ్యాక్సిన్ మొదటి కోర్సును తీసుకున్నారు. బైడెన్ వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్లగా ఆమె కూడా హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో బైడెన్ "ఈ రోజు నేను కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నాను. ఈ వ్యాక్సిన్‌ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన శాస్త్రవేత్తలు, వైద్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము మీకు చాలా రుణపడి ఉన్నాము. ఇక అమెరికా ప్రజలు ఒక విషయం తెలుసుకొండి. దీనిలో భయపడాల్సిన విషయం ఏం లేదు. ఇక జనాలందరికి సరిపడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నాడు మీరు దాన్ని తీసుకోవడానకి సిద్ధంగా ఉండండి" అని ట్విట్టర్ వేదికగా జనాలను కోరారు.
Today, I received the COVID-19 vaccine.
— Joe Biden (@JoeBiden) December 22, 2020
To the scientists and researchers who worked tirelessly to make this possible — thank you. We owe you an awful lot.
And to the American people — know there is nothing to worry about. When the vaccine is available, I urge you to take it. pic.twitter.com/QBtB620i2V
President-elect Joe Biden received a Covid-19 vaccine today.
— CNN (@CNN) December 21, 2020
“I’m doing this to demonstrate that people should be prepared, when it’s available, to take the vaccine. There’s nothing to worry about. I’m looking forward to the second shot.” https://t.co/Wl0trd3fss pic.twitter.com/ZaJzfunUSu
బైడెన్ చర్యని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రశంసించారు. నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటూ మెచ్చుకున్నారు. ఇక వచ్చే వారం కమలా బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష