టాటాస్కైతో ఉచిత ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు..

- December 22, 2020 , by Maagulf
టాటాస్కైతో ఉచిత ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు..

క‌రోనా విప‌త్తుతో బ‌డులు ఇంకా తెరుచుకోలేదు. త‌ర‌గ‌తి పాఠాల‌న్నీ ఫోన్ల తెర‌ల‌పైనే న‌డుస్తున్నాయి. చిన్న స్క్రీన్లపై పాఠాల‌ను విన‌డం ఎంతైనా కష్టమే. దేశంలోని విద్యార్థుల కోసం టాటా స్కై తన చందాదారులందరికీ ఉచిత ఆన్‌లైన్‌ త‌ర‌గ‌తుల‌ను అందిస్తోంది. ఈ సేవలు ఛానల్ నంబర్ 653లో ఉచితంగా వీక్షించొచ్చు.Tata Sky Classroom Education Service మొట్టమొదట 2016లో ప్రారంభించారు. మ్యాథ్స్ మరియు సైన్స్ కోసం 700 కి పైగా యానిమేటెడ్ కాన్సెప్ట్ లెర్నింగ్ వీడియోలను ఇందులో చూడొచ్చు. ఈ త‌ర‌గ‌తులు ప్రస్తుతం హిందీ మరియు ఇంగ్లీష్ భాష‌ల్లో చూడొచ్చు. దీనితో టాటా స్కై టీవీలో నేర్చుకునే కంటెంట్‌ను భారతదేశం అంతటా విద్యార్థులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది, పాఠశాలలు తిరిగి తెరుచుకోనందున ఈ టీవీ త‌ర‌గ‌తులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవ‌చ్చు.

ప్రస్తుతం ఉన్న మ‌రియు కొత్త చందాదారులందరికీ ఉచితంగా లభిస్తుంది. దేశవ్యాప్తంగా 22 మిలియన్లకు పైగా కనెక్షన్లు ఉన్నాయని కంపెనీ చెబుతోంది. టాటాస్కైలో చాన‌ల్‌ నంబర్ 653 ద్వారా ఎడ్యుకేష‌న్‌కు సంబంధించిన‌ విషయాలను యాక్సెస్ చేయ‌వ‌చ్చు. క్లాస్‌రూం స‌ర్వీస్‌లో భాగంగా టీవీలో ఆకర్షణీయమైన ఇంటరాక్టివ్ లెర్నింగ్ కంటెంట్‌ను అందిస్తోంది. విద్యార్థులకు ఏ అనుకూలమైన సమయంలోనైనా విద్యా విషయాలను యాక్సెస్ చేయడానికి వీలు ఉంది. మ్యాథ్స్ మరియు సైన్స్ యొక్క ప్రాథ‌మిక విష‌యాల‌ను చాలా ఈజీగా నేర్చుకోవ‌డానికి యానిమేటెడ్ కాన్సెప్ట్-లెర్నింగ్ వీడియోలను అందుబాటులో ఉన్నాయి.

టాటా స్కై క్లాస్‌రూమ్ స‌ర్వీస్‌ 5వ తరగతి నుండి 8వ తరగతి విద్యార్థుల‌కు నిర్దేశించ‌బ‌డింది. ఇది ఇంగ్లీష్ మరియు హిందీ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. వీడియో పాఠాలతో పాటు, ఎడ్యుకేష‌న్ గేమ్‌లు కూడా ఉన్నాయి. అవి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా పిల్లలకు ఎంతో విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి.Tata Sky Classroom Education Service ప్రారంభించడానికి వినియోగదారులు తమ పిల్లలకు సరిపోయే గ్రేడ్‌ను ఎంచుకోవాలి. అయితే టాటా స్కై 5 నుండి 8 తరగతులకు మాత్రమే కంటెంట్‌ను అందిస్తుంది మరియు ఇతర పిల్లలకు కంటెంట్ ఇంకా అందుబాటులో లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com