డీజీపీ కమెండేషన్ డిస్క్ అవార్డులను అందజేసిన ఎపి డిజిపి
- December 22, 2020
అమరావతి:మంగళగిరి లోని 6th బెటాలియన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ ఏపీఎస్పీ అధికారులు గత సంవత్సరం లో కష్టపడి పనిచేసి అత్యుత్తమ సేవ చేసిన 38 మంది ఏపీఎస్పీ అధికారులు, సిబ్బందికి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ డిజిపి డిస్క్ అవార్డులను అందజేయడం జరిగింది. ఏపీఎస్పీ అనేది ఒక ఫోర్స్ లాగా ఏర్పాటైందని ఈ ఫోర్స్ స్వాతంత్రం ముందు నుంచే కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ఈశాన్య రాష్ట్రాల్లో సైతం తమ సేవలు అందించిన చరిత్ర ఏపీఎస్పీ బెటాలియన్ అని పేర్కొన్నారు. ఏపీఎస్పీ అమూల్యమైన సేవలు పోలీసులకు, సెక్యూరిటీ సంస్థలకు వెన్నెముక వంటిది అని, ఏపీఎస్పీ ఉన్న చోట పరిస్థితులు త్వరగా అదుపులోకి వస్తాయి అని గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సెక్యూరిటీ తో పాటు దేశంలో కూడా ఏపీఎస్పీ సేవలు కీలకమైన ఒక భాగమేనని పేర్కొన్నారు. అంతేకాకుండా ఏపీ పోలీస్ దేశంలోనే ఒక అత్యుత్తమ పోలీస్ ఫోర్స్ గా గుర్తించబడింది.
అందిస్తున్న సేవలకు అవసరమైన వనరులు లేకపోయినా ఏపీఎస్పీ పోలీస్ పనిచేస్తుందని బాధ్యత, పారదర్శకత, ప్రతిభ ప్రదర్శిస్తూ ఏపీ పోలీస్ ప్రతినిత్యం పనిచేస్తుందన్నారు. పోలీస్ సర్వీసులను ఉత్తమంగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి అంతగానో తోడ్పాటు అందిస్తున్నారని, పోలీసు వ్యవస్థలో వచ్చిన మార్పులు, అందిస్తున్న సేవలు సామాన్య ప్రజలకు పోలీసుల ప్రాధాన్యత తెలిజేసె సేవలను అందించాలన్నారు.పోలీసుల నుండి ప్రజలకు ఉత్తమమైన సేవలను అందించేందుకు స్పందన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడంతో ప్రజలకు సత్వరమే న్యాయం జరుగుతుందని స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ లకు వస్తున్న ఫిర్యాదులపై నేరుగా సీఎం కార్యాలయం వరకు పర్యవేక్షణ ఉండేవిధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. స్పందనలో వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికంగా 52 శాతం మహిళలు ఇస్తున్నారని మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అనడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం అని పేర్కొన్నారు.ప్రజలకోసం ఇటీవల ప్రవేశపెట్టిన పోలీస్ సేవా యాప్ కేవలం మూడు నెలల కాల వ్యవధి లోనే 1.05లక్షలకు పైగా ఎఫ్ఐఆర్ డౌన్ లోడ్ చేసుకున్నారని,అంతే కాకుండా ఏపీ పోలీసులకు గత సంవత్సర కాలంలో 108 అవార్డులను ఉత్తమ సేవలకు గాను అందుకుంది అని అదే విధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐసీజెఎస్ లో దేశంలోనే రెండవ స్ధానం ఏపీ పోలీస్ నిలిచింది అని పేర్కొన్నారు.అదే విధంగా రాబోయే రోజుల్లో పోలీసులు మేం ఉన్నాం, మీకోసమే ఉన్నాం అనే నమ్మకం బలహీనవర్గాలకు అండగా, వ్యక్తిగతంగా అందరం కలిసి ఏపీ పోలీసులు దేశానికే గర్వకారణం అయ్యేలా కోరారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డిజి రవి శంకర్ అయ్యనార్ తో పాటు పలువురు సీనియర్ IPS అధికారులు పాల్గొన్నారు.
డిజిపి ఏపీఎస్పీ బెటాలియన్స అడిషనల్ డిజి 2012 లో తీసుకోవచ్చిన సంస్కరణలు:
ముఖ్యంగా :
1. ఎ.పి.యస్.పి సిబ్బందికి ఇచ్చే మూడు రోజులు పర్మిషన్ ను నాలుగు రోజులుకు పెంచడం.
2. ఎ.పి.యెస్.పి ప్రయాణ భారం తగ్గించటానికి మరియు వారి కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండటానికి వీలుగా బెటాలియన్ కు సుమారు 150 కి.మీ. పరిధిలో విధులు నిర్వర్తించేందుకు గౌరవ డిజిపి sir అప్పట్లో చర్య తీసుకోవడం జరిగింది.
3. పోలీసు కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి బెటాలియన్ లో Subsidiary Central Police Canteen లను ఏర్పాటు చేయడంతో సిబ్బంది కుటుంబసభ్యులకు ఆర్ధిక లాభము కలిగింది.
4. అదే విధంగా వీరి హయాంలోనే 14వ బెటాలియన్ తాడిపత్రి నుండి అనంతపురంనకు మార్చడం, అనుకూలమైన స్తలాన్ని సమకూర్చి అందులో అధునాతన భవన నిర్మాణాలు ఏర్పాటు జరిగింది. అంతే కాకుండ AP-SDRF అనేక మంది ప్రాణాలను కాపాడిన సంఘటనలను మనం రోజూ చూస్తూ ఉన్నాం. ప్రకృతి విపత్తులు అయిన వరదలు, తుఫానులు వచ్చినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఆస్తి ప్రాణనష్ట నివారణకు State Disaster Response Force (AP SDRF) ఏర్పాటు గౌరవ DGP sir కృషి పట్టుదల వలన సాధ్యపడింది.


తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







