కువైట్‌ ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్న కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌

- December 23, 2020 , by Maagulf
కువైట్‌ ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్న కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌

కువైట్ సిటీ:కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌కి సంబంధించి తొలి షిప్‌మెంట్‌ ఈ రోజు ఉదయం కువైట్‌ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. ఈ వారాంతంలో వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌కి చెందిన 400 మందికి పైగా ఉద్యోగులు వ్యాక్సినేషన్‌ ప్రాసెస్‌కి సంబంధించి ట్రెయినింగ్‌ ఉద్యోగులు శిక్షణ పొందారు. ఫస్ట్‌ స్టేజ్‌ వ్యాక్సినేషన్‌ని హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్స్‌కి, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కి, అందునా 65 ఏళ్ళు పైబడినవారికి ఇవ్వనున్నట్లు మినిస్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ బాసిల్‌ అల్‌ సబా గతంలోనే వెల్లడించిన విషయం విదితమే. ఇదిలా వుంటే, 73,000 మంది ఇప్పటికే వ్యాక్సినేషన్‌ కోసం ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ప్రీ-రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com