రేపు రాష్ట్రపతిని కలవనున్న రాహుల్ గాంధీ

- December 23, 2020 , by Maagulf
రేపు రాష్ట్రపతిని కలవనున్న రాహుల్ గాంధీ

న్యూ ఢిల్లీ:రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సేకరించిన  2 కోట్ల సంతకాలతో ఓ  మెమోరాండం ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి అందజేయనున్నారు. తమ పార్టీ ఎంపీలతో కలిసి ఆయన కాలినడకన రాష్ట్రపతి భవన్ కు వెళ్లనున్నారు.కేంద్రం తెచ్చిన ఈ చట్టాల రద్దు విషయంలో జోక్యం చేసుకొవాలని రాష్ట్రపతిని అభ్యర్థించనున్నారు. ఇప్పటికే నిరసనలు, ఆందోళనల  సందర్భంగా 44 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, ఈ చట్టాలు అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగించేవిగా ఉన్నాయని ఈ మెమొరాండంలో పేర్కొన్నట్టు కాంగ్రెస్ నేత కేసీ, వేణుగోపాల్ తెలిపారు. రైతులతో రాజీ కుదుర్చుకుంటున్న రీతిలో కేంద్రం అన్నదాతలను మోసగిస్తోందని, కార్పొరేట్ సంస్థల బాగు కోసమే ఈ చట్టాలను తెచ్చిందని ఆయన ఆరోపించారు. పైగా వీటి విషయంలో తప్పుడు ప్రచారం చేస్తోందని,  రైతాంగాన్ని అవమానపరుస్తోందని వేణుగోపాల్ అన్నారు. తమ పార్టీ దేశ వ్యాప్తంగా సేకరించిన 2 కోట్ల సంతకాలతో కూడిన ఈ మెమోరాండం ను రాష్ట్రపతికి అందజేస్తున్నామన్నారు.

దాదాపు రెండు వారాల క్రితం కూడా రాహుల్ గాంధీ ఆధ్వర్యాన ఎన్సీపీ నేత శరద్ పవార్, సీపీఎం సీనియర్  నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డీ.రాజా, డీఎంకే నాయకుడు ఇళంగోవన్ లతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసి .. రైతు చట్టాల రద్దు విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఓ వినతిపత్రాన్ని సమర్పించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com