మనోడి కధ వేరేగా ఉందిలే
- December 24, 2020
బిగ్ బాస్ సీజన్ 4 లో ఎవరికీ ఎలాంటి అవకాశాలు వచ్చాయో తెలియదు కానీ.. తెలివిగా మూడో స్థానంలో తప్పుకుని డబ్బు తీసేసుకున్న సోహెల్ కి మాత్రం బిగ్ బాస్ చేసిన హెల్ప్ అంత ఇంతా కాదు. ఈ సీజన్ లో విన్నర్ అభిజిత్, రన్నర్ అఖిల్ తర్వాత మూడో స్థానంలో నిలిచిన సోహెల్ దూసుకుపోతున్నాడు. అభిజిత్ తో పాటుగా అఖిల్ తో పాటుగా టివి ఛానల్స్ లో కూర్చుని ఇంటర్వూస్ ఇస్తున్న సోహెల్ కి బంపర్ ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. అభిజిత్ కి అవకాశాలు వచ్చాయన్నారు కానీ.. ఎక్కడా క్లారిటీ లేడు. ఇక అఖిల్ కి కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండబట్టి పెద్దగా అవకాశాల జోరు కనిపించడం లేదు.
అభిజిత్ కన్నా ఇప్పుడు సోహెల్ స్పీడు చూస్తే బిగ్ బాస్ తో సోహెల్ సెటిల్ అయినట్లే అంటున్నారు. విన్నర్, రన్నర్ కన్నా సోహెల్ స్పీడు కి అందరూ షాకవుతున్నారు. అభిజిత్ తో పాటుగా డబ్బులు పంచుకున్న సోహెల్.. ఇప్పుడు అవకాశాల విషయంలో బిగ్ బాస్ విన్నర్ కన్నా రన్నర్ కన్నా స్పీడుగా ఉన్నాడు. ఇప్పటికే చిరు, బ్రహ్మి లు ఎలాంటి పారితోషకాలు లేకుండా నీ సినిమాలో నటిస్తామంటే ఇప్పడు సోహైల్ హీరోగా సినిమా అనౌన్సమెంట్ వచ్చేసింది.
ప్రెజర్ కుక్కర్ నిర్మాత.. శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్షన్ లో సోహెల్ హీరోగా ఫిబ్రవరిలో సినిమా మొదలెట్టబోతున్నట్టుగా అనౌన్స్ చేసారు. మరి సోహెల్ నిర్మాతగా కాదు ముందు హీరోగానే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. సోహెల్ కి స్టార్ మా కూడా బిగెస్ట్ ఆఫర్ ఇచ్చినట్టుగా సమాచారం. మరి సోహెల్ దూకుడు చూసిన వారు ఇప్పుడు కంగారు పడిపోతున్నారట.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







