జగపతిబాబు ప్రధాన పాత్రలో ' ఫాదర్- చిట్టి - ఉమ - కార్తీక్'
- December 24, 2020
ప్రముఖ కథానాయకుడు జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా యువ జంటగా కార్తీక్, తమిళ నాయిక అమ్ము అభిరామి(తమిళ చిత్రం ‘అసురన్‘ ఫేమ్) నటిస్తున్నారు. బాల నటి సహశ్రిత మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.
దర్శకుడు విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. విద్యాసాగర్ రాజు చెప్పిన కథలోని నవ్యత ఎంతగానో నచ్చింది. తమ సంస్థ నిర్మిస్తున్న పథ్నాలుగవ చిత్రమిది అని తెలిపారు నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్. ఇక ఈ చిత్రం పేరు ' ఫాదర్- చిట్టి - ఉమ - కార్తీక్'. చిత్ర కథానుసారమే పేరును నిర్ణయించాం. చిత్రం లోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ ప్రచార చిత్రాలను విడుదల చేయనున్నాము అని తెలిపారు నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్. ఆయనే మాట్లాడుతూ...‘చిత్ర నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కోవిడ్ సమయంలో ధియేటర్ లు తెరుచుకోని పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే ఈ రంగం కోలుకునే దిశగా ప్రయాణం మొదలవుతోంది. మంచి చిత్రాలను కుటుంబ సమేతంగా ధియేటర్ లో చూసి ఆదరించే ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈ చిత్రం రూపొందింది. ధియేటర్ లలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. జనవరి 2021 లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు శ్రీ రంజిత్ మూవీస్ సంస్థ అధినేత కె.ఎల్. దామోదర్ ప్రసాద్.
దర్శకుడు విద్యాసాగర్ రాజు మాట్లాడుతూ...‘ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‘ గా ఈ చిత్రానికి రూపకల్పన చేయటం జరిగింది. ఈ చిత్రం పేరు ను బట్టి ఇది మరింతగా ప్రస్ఫుటమవుతుంది అన్నారు. 'ఫాదర్- చిట్టి - ఉమ - కార్తీక్' అనే పాత్రల మధ్య జరిగే ఈ చిత్ర కథలో భావోద్వేగాలు, వినోదం సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి అని తెలిపారు దర్శకుడు.
చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు: కరుణాకర్, ఆదిత్య; ఛాయాగ్రహణం: శివ.జి; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; పాటలు: కరుణాకర్, ఆదిత్య, భీమ్స్; ఎడిటింగ్: కిషోర్ మద్దాలి; ఆర్ట్: మూర్తి
కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు